జటాధార నుంచి మరో ట్రీట్‌!

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘జటాధర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ గా ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.

తాజాగా, మేకర్స్ మరో స్పెషల్ ట్రీట్ కోసం రెడీ అవుతున్నారు. సినిమాలోని రెండో సింగిల్ సాంగ్ ‘పల్లో లట్కె’ను అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. సుధీర్ బాబు, శ్రేయా శర్మ డ్యాన్స్ ఫీచర్స్ ఈ సాంగ్‌లో ప్రేక్షకులను ఆకట్టబోతున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో టాలీవుడ్‌లో అడుగుపెట్టుతోంది. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘల్, నిఖిల్ నంద ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories