దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం అన్ని పాన్ ఇండియా భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
చాలా మంది ఈ సినిమా హిందీ మార్కెట్లో కూడా భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందనుకున్నారు. కానీ అక్కడ అంత స్థాయిలో రన్ కాకపోయినా, సినిమా వసూళ్లు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వీక్‌డేస్‌లో కూడా కాంతార చాప్టర్ 1 కలెక్షన్లలో దూకుడు తగ్గలేదు.
సోమవారం ఈ సినిమా 8 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించగా, మంగళవారం మాత్రం అనూహ్యంగా పెరిగి దాదాపు 11.7 కోట్లకు పైగా రాబట్టింది.