ఈ ఏడాది ఇండియన్ సినీ ప్రపంచంలో వచ్చిన పలు పెద్ద కాంబో సినిమాల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై రిలీజ్‌కి ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్స్‌లో విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.
ఇప్పుడీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఓటిటి ప్రేక్షకులకు అయితే ఒక గుడ్ న్యూస్ అందింది. వార్ 2 డిజిటల్ హక్కులు ఇప్పటికే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఆ సంస్థ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ స్ట్రీమింగ్కి అందుబాటులోకి రానుంది.