కాంతారా 1 మరో భారీ మైల్‌ స్టోన్‌

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తన దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం కాంతార చాప్టర్ 1 ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గతంలో విడుదలైన కాంతార సినిమాతో భారీ విజయాన్ని సాధించిన రిషబ్, ఆ చిత్రానికి ముందు జరిగిన కథను ఈసారి చూపించాడు. అందుకే ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది.

రిళీజ్ అయిన వెంటనే ఈ సినిమా ప్రతి భాషలోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా కంటెంట్, విజువల్స్, రిషబ్ శెట్టి నటన సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. ఫలితంగా వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.

అమెరికా మార్కెట్‌లో కూడా ఈ సినిమా అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం నార్త్ అమెరికా ప్రాంతంలోనే 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు సాధించి బాక్సాఫీస్ వద్ద తన దూకుడు కొనసాగిస్తోంది. ప్రతీ రోజు బలమైన హోల్డ్ తో వసూళ్లను కొనసాగిస్తున్న ఈ చిత్రం, ఇంకా మంచి లాంగ్ రన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories