భారతీయ సినిమా చరిత్రలో భయానక సినిమాల గురించి మాట్లాడితే మరాఠీ సినిమా తుంబాడ్ పేరు తప్పకుండా వస్తుంది. ఈ చిత్రం అందించిన విజువల్ అనుభవం, కథలోని డార్క్ ఎలిమెంట్స్, టెక్నికల్ వర్క్ అన్నీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాయి. అందుకే ఇప్పటికీ ఈ సినిమా బెస్ట్ హారర్ మూవీల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది.
ఇప్పుడు ఆ క్లాసిక్ సినిమాకు కొనసాగింపుగా తుంబాడ్ సీక్వెల్ ప్లాన్ అవుతోందన్న వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. దర్శకుడు అనీల్ రాహి బర్వె మళ్లీ ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌పై పాన్ ఇండియా స్థాయిలో పెద్ద అంచనాలు ఉన్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిప్రకారం, ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. 2026లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.