సర్ప్పైజ్‌ ఏమి లేదు కానీ..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్లీ సంచలనం సృష్టించబోతున్న సినిమా “బాహుబలి ది ఎపిక్”. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, విజన్‌రీ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఒకప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఈ మహత్తర చిత్రం రీరిలీజ్ అవుతుండటంతో మళ్లీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొంది.

ఇక రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాకి మళ్లీ థియేటర్లలో భారీ స్పందన రావడం ఖాయం అనుకుంటున్నారు. కానీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో “బాహుబలి పార్ట్ 3”కు హింట్ ఇస్తారట అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత శోభు యార్లగడ్డ స్పష్టం చేశారు.

అయినా సరే ఆయన మాటల్లో మరో ఇంట్రెస్టింగ్ అంశం దాగి ఉంది. పార్ట్ 3 లేనప్పటికీ, రీరిలీజ్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం సినిమా టీమ్ అందరూ రీరిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారని కూడా చెప్పారు.

అంటే బాహుబలి అభిమానులకు కొత్త చాప్టర్ కాకపోయినా, ఏదో కొత్త అనుభూతి మాత్రం థియేటర్‌లో దొరకొచ్చని అర్థం.

Related Posts

Comments

spot_img

Recent Stories