ఇటీవల సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చకు కారణమైన వార్తల్లో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారనే వార్త. ఈ ఇద్దరు లెజెండరీ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారనే వార్తతో అభిమానుల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
మొదట ఈ ప్రాజెక్ట్‌కి “లియో” ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని టాక్ వచ్చింది. కానీ తర్వాత అది నిజం కాదనే మరో సమాచారం బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ భారీ కాంబినేషన్ సినిమాని ఎవరూ డైరెక్ట్ చేస్తారు అనే ఆసక్తి కొనసాగుతోంది.
తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కోసం యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ పేరు కూడా వినిపించింది. అయితే తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రదీప్ ప్రస్తుతం దర్శకత్వం నుండి దూరంగా ఉండి తన నటన మీదే దృష్టి పెట్టాడని చెబుతున్నారు. అంటే ఈ మల్టీస్టారర్‌కి ఆయన డైరెక్టర్ కాదనే విషయం క్లియర్ అయిందనే మాట.