కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సెన్సేషన్ “కాంతార చాప్టర్ 1” ఇప్పుడు అన్ని వర్గాల్లో దూసుకుపోతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు దర్శకత్వం కూడా ఆయనే వహించారు. రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్స్ లో రికార్డులు సృష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దూకుడు ఆగడం లేదు. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా రికార్డుల్లో కొత్త చాప్టర్ రాసింది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో కూడా ఈ సినిమా అద్భుతమైన రన్ చూపిస్తోంది. ప్రస్తుతం 2.7 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించగా, త్వరలోనే 3 మిలియన్ క్లబ్లో చేరే దిశగా దూసుకెళ్తోంది.