టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా హీరోగా నటిస్తున్న తాజా సినిమా చాంపియన్ ఇప్పటికే సినిమా అభిమానుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చూసి ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్ నిర్మిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై మంచి క్రేజ్ ఏర్పడింది.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. కథతో పాటు స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ను ఆసక్తికరంగా చూపించేందుకు మేకర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు.
తాజాగా సినిమా టీమ్ ఒక కీలక అప్డేట్ను బయటకు తెచ్చింది. చాంపియన్ సినిమాను క్రిస్మస్ స్పెషల్‌గా, అంటే 2025 డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.