ఆ పనిలో బిజీగా అఖండ 2!

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2పై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ వరుసగా బయటకి వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం. తాజాగా ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సుమారు 13 కోట్లకు ముగిసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ మంచి రేంజ్‌లో రికార్డ్ ఫిగర్స్‌తో సేల్ పూర్తయినట్టుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారు చేపట్టారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రానుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories