మన శంకర వరప్రసాద్‌ గారి గురించి మేకర్స్‌ ఏం అన్నారంటే!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాకు అభిమానులు పెద్దగా ఎగ్జైటయ్యారు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా కనిపించబోతున్నాడు. చిరంజీవి సరసన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

తాజాగా విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటూ, యూట్యూబ్ లో హిట్‌గా మారింది. అయితే కొంత మంది యాంటీ ఫ్యాన్స్ ఈ ప్రోమోపై ట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, మేకర్స్ ఇకపై ప్రతి కంటెంట్ పై మరింత జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఫుల్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేక స్టైల్‌తో సంగీతాన్ని డామినేట్ చేస్తాడని చెప్పబడుతోంది. భీమ్స్ అందించిన సంగీతం, ఉదిత్ నారాయణన్ గారి వోకల్స్ కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేస్తాయని మేకర్స్ వెల్లడించారు. నయనతార శశిరేఖ పాత్రలో కనిపిస్తుందని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక సెట్‌లో పాటల షూటింగ్ జరుగుతోంది.

మేకర్స్ ప్లాన్ ప్రకారం, ఈ సినిమా 2026 సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories