సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా సినిమా సంబరాల ఏటి గట్టు పై సినీప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను రోహిత్ కె.పి తెరకెక్కిస్తుండగా, యాక్షన్‌తో నిండిన ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే వచ్చిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక దసరా సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేకమైన అప్డేట్ను అందించింది. ఈ సందర్భంగా ప్రీ-గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. అందులో సాయి దుర్గ తేజ్ శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు.
ఈ గ్లింప్స్‌ను హీరో జన్మదినోత్సవ కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సినిమాలో సాయి దుర్గ తేజ్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.