మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం మేకర్స్ ప్రత్యేకంగా ఒక మ్యూజిక్ ట్రీట్ రెడీ చేశారు. లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ స్వరం, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్‌తో వచ్చిన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు.
ప్రోమోలో చిరంజీవి గ్రేస్ అచ్చం వింటేజ్ టచ్‌ని గుర్తు చేస్తుంది. కేవలం కొన్ని సెకన్ల వీడియోలోనే ఆయన స్టెప్పులు, స్టైల్ చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కారు మీద కూర్చొని చేసే సీన్ నుంచి చేతిలో కర్చీఫ్‌ని ఎగరేస్తూ వేసిన స్టెప్పుల వరకు, ప్రతి క్షణం చిరంజీవి ఇమేజ్‌కి బాగా సరిపోయేలా ఉంది. ఈ వయసులో కూడా ఆ ఎనర్జీ, ఆ గ్రేస్‌ని చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.