పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల మిరాయ్ సినిమాతో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు మరో పెద్ద సినిమాను ప్లాన్ చేస్తోంది. దసరా 2026కి స్పెషల్‌గా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను రాజుగారి గది 4 శ్రీచక్రం అని ఖరారు చేశారు.
దసరా సందర్భంలో విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే మంచి చర్చ తెచ్చుకుంది. ఎర్రని చీరలో ఓ మహిళ గాల్లో తేలుతూ ఉండగా, ఆమె వెనుక కాళీదేవి విగ్రహం కనిపించడం పోస్టర్‌కి మరింత మిస్టరీ కలిగించింది. ఈ సినిమా ఒకవైపు భయపెట్టేలా, మరోవైపు వినోదం పంచేలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. పవిత్రత, హారర్, కామెడీ అన్నీ కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు. ఆయన చేరడం వల్లే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఇంకా పెరిగాయి. దసరా 2026లో థియేటర్లలో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.