పెరిగిన కాంతారా1 టికెట్‌ రేట్లు!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న పెద్ద ప్రాజెక్ట్‌ “కాంతార చాప్టర్ 1”పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను దసరా పండుగ బహుమతిగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. రిషబ్ శెట్టి హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ దగ్గర తనదైన మార్క్ చూపించాలనుకుంటున్నాడు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ రేట్లపై అదనంగా సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ పెరిగిన ధరలు అక్టోబర్ 1న జరిగే ప్రత్యేక ప్రీమియర్స్ నుంచి అక్టోబర్ 11 వరకు అమల్లో ఉండనున్నాయి.

టికెట్ ధరల పెంపు నిర్ణయంతో “కాంతార చాప్టర్ 1” టీమ్ చాలా సంతోషంగా ఉంది. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories