స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కి విడాకులు!

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి దంపతులు ఇప్పుడు అధికారికంగా విడిపోయారు. చాలా రోజులుగా వీరి వ్యక్తిగత జీవితంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చివరికి చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరి విడాకులకు ఆమోదం తెలిపింది.

2013లో ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక కూతురికి తల్లిదండ్రులు అయ్యారు. అయితే గడచిన సంవత్సరం నుంచి వీరి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. అదే కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది మేలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. కూతురు తన తల్లితో ఉండటానికి ప్రకాశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు.

ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories