సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గురించి సినీప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. అందుకే అభిమానులు ప్రతి చిన్న అప్డేట్ కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు. మేకర్స్ కూడా ఎలాంటి హంగామా లేకుండా భారీ షెడ్యూల్స్ ను పూర్తిచేస్తూ షూటింగ్ ను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇప్పుడేమో ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు చూపుతున్న కట్టుబాటు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూట్ లో ఆయన ఎలాంటి డూప్ ను ఉపయోగించకుండా అన్ని సీన్స్ ను స్వయంగా చేస్తున్నాడని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలైనా, రిస్క్ ఉన్న సీక్వెన్స్ లైనా మహేష్ స్వయంగా చేయడమే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆయన ఈ స్థాయి డెడికేషన్ చూసి రాజమౌళి కూడా ఆశ్చర్యపోతున్నారని టాక్ వినిపిస్తోంది.