పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తాజా సినిమా “ఓజి” విడుదలైన వెంటనే భారీ స్థాయిలో వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రదర్శనను మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి వీక్షించారు. షో చూసిన తర్వాత చిరంజీవి తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.
చిరు మాటల్లో చెప్పాలంటే, ఈ సినిమాను తాను తన కుటుంబంతో కలిసి చూసి పూర్తిగా ఆస్వాదించానని తెలిపారు. హాలీవుడ్ రేంజ్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించినప్పటికీ అందులో మంచి ఎమోషన్లు కూడా మిళితం కావడం తనను బాగా ఆకట్టుకుందని అన్నారు. దర్శకుడు సుజీత్ మొదటి నుంచి చివరి వరకు సినిమాను ఎనర్జీతో నింపారని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ తెరపై చూపించిన స్టైల్, స్వాగ్ తనకే కాకుండా ఫ్యాన్స్‌కి కూడా పండగలా అనిపిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే థమన్ అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని, రవి కే చంద్రన్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరి కృషి స్పష్టంగా కనిపిస్తుందని, నిర్మాత డీవీవీ దానయ్యకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.