మలయాళంలో వచ్చిన సూపర్ హీరో సినిమా ‘లోక చాప్టర్ 1’ మంచి విజయాన్ని సాధించింది. డైరెక్టర్ డొమినిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కళ్యాణి ప్రియదర్శన్ నటించగా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద హిట్టయింది.
ఈ విజయంతో పాటు మేకర్స్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు అప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘లోక చాప్టర్ 2’ పేరుతో కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ అందరిని ఆకర్షించారు. ఇందులో మొదటి భాగంలో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన టొవీనో థామస్, దుల్కర్ సల్మాన్‌ను చూపించారు.
ఈ పోస్టర్ బయటకు రావడంతో అభిమానుల్లో కొత్త సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందిస్తున్నారు.