పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ఓజీ థియేటర్లలో అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనడంతో మొదటి షో నుండి హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 154 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి పవన్ కెరీర్‌లోనే కొత్త రికార్డ్ సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు సుమారు 63 కోట్ల షేర్‌ను తెచ్చిపెట్టింది. ఇందులో నైజాంలోనే 24 కోట్ల వరకు రాబట్టగా, సీడెడ్‌లో 7.5 కోట్లు, ఆంధ్ర ప్రాంతంలో 31.5 కోట్ల షేర్ వచ్చింది.
రిలీజ్ కంటే ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24 రాత్రి నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్స్ సినిమా కలెక్షన్లకు మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇప్పుడు వీకెండ్‌లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.