టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్ గా వినిపిస్తున్న సినిమా ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యువ మరియు టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదల రోజే రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ విజయంతో పాటు, ఇటీవల సుజీత్ మీడియా తో పంచుకున్న ఇంటరాక్షన్ లో, ఆయన చెప్పిన మరో ఆసక్తికర అంశం అభిమానులను ఉత్కంఠలో ఉంచింది.
సుజీత్ అసలు ‘సాహో’ తర్వాత తన కొత్త ప్రాజెక్ట్ కోసం ఆలోచనలు ప్రారంభించారని తెలిపారు. ఆ ప్రాజెక్ట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో యూకే నేపథ్యాన్ని ఉపయోగించి ఒక పవర్ ఫుల్ సినిమా రూపొందించాలనుకున్నారని చెప్పారు. కానీ ఆ సమయంలో కరోనా ప్రభావం వల్ల ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని వెల్లడించారు.
ఇలాంటి సందర్భాలు చూస్తే, భవిష్యత్తులో సుజీత్-చరణ్ కాంబినేషన్ లో సినిమా రావచ్చునని అభిమానులు పెద్ద ఆశలు పెట్టుకుంటున్నారు.