ఇడ్లీ కొట్టు రన్ టైమ్‌ లాక్‌ అయ్యింది!

ధనుష్ మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన తాజా చిత్రం ఇడ్లీ కడై తెలుగులో ఇడ్లీ కొట్టు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ధనుష్ హీరోగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U సర్టిఫికెట్ పొందింది. తాజాగా దీని నిడివి కూడా బయట పెట్టారు. ఈ సినిమా మొత్తం 147 నిమిషాలు అంటే రెండు గంటల 27 నిమిషాలు కొనసాగనుందని సమాచారం.

అరుణ్ విజయ్, శాలినీ పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ వంటి నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించగా, సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories