పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఓజి” ఇక ఇంకో రోజులోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న హైప్ కొత్త స్థాయికి చేరుకుంది. రికార్డులను తిరగరాయడానికి సిద్ధంగా ఉందన్న ఉత్సాహం ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
రిలీజ్ కి ముందు బయటకు వచ్చిన తాజా పోస్టర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రక్తపాత సన్నివేశంలో కటానా పట్టుకుని పవన్ కళ్యాణ్ బీస్ట్ మోడ్ లో కనిపించడం ఫ్యాన్స్ కి అదనపు ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. నిన్న విడుదలైన ట్రైలర్ లో కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన ఒక షాట్ చూపించారు. దాంతో ఈ ఫైట్ ఎపిసోడ్ ఊహించిన దానికంటే పెద్ద రేంజ్ లో ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి.
ఈ భారీ యాక్షన్ డ్రామా కి సంగీతం థమన్ అందించగా, పవన్ కళ్యాణ్ కి అభిమానిగా ఉండే సుజీత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.