పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ సినిమా ఓజి చుట్టూ ఇప్పటికే అద్భుతమైన హంగామా నడుస్తోంది. సుజీత్ దర్శకత్వంలో, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ హైప్ మధ్యలో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా హాట్ టాపిక్ అయింది. అదేంటంటే పవన్ కుమారుడు అకిరా నందన్ కూడా సినిమాలో ఉంటాడనే అంచనాలు.
ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ సాంగ్ నుంచే కొన్ని క్లూస్ దొరికాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ డిజైన్స్ లోని కొన్ని హింట్స్ చూసి అకిరా కూడా సినిమాలో భాగమని ఊహించుకున్నారు. ఇక తాజాగా ఆన్లైన్ లో ఒక గేమ్ హంగామా చేస్తోంది. ఆ గేమ్ లో ఒక కత్తి మీద కనిపించే కళ్ళు చూసి చర్చలు మరింత బలంగా మారాయి. అవి పవన్ కళ్యాణ్ కళ్ళు కాదని స్పష్టంగా తెలుస్తుంది కానీ చాలా దగ్గరగా చూసినప్పుడు అవి అకిరా కళ్ళ్లా ఉన్నాయనే భావన వస్తోందని అభిమానులు చెబుతున్నారు.
దీంతో సినిమా లో ఆయన ఎంట్రీ నిజమేనా అన్న ఊహాగానాలు మళ్లీ హీట్ అయ్యాయి.