పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘ఓజి’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను చాలా స్టైలిష్‌గా కట్ చేయగా, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డైలాగ్స్, ఎలివేషన్స్ మొత్తం కలిసి అభిమానులను ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత పవన్‌ను ఓజస్ గంభీరంగా చూడటం ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.
పవన్ గతంలో ‘పంజా’లో ఇలాగే స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇప్పుడు మరోసారి అలాంటి గ్యాంగ్‌స్టర్ షేడ్‌తో తెరపై దర్శనమివ్వడం అభిమానుల్లో మళ్లీ ఉత్సాహాన్ని పెంచింది. ముఖ్యంగా దర్శకుడు సుజీత్, పవన్‌కు సరిపోయే వింటేజ్ లుక్‌ను యాక్షన్ మోడ్‌లో చూపించిన తీరు బాగా నచ్చింది.
సినిమా ప్రీమియర్స్‌కు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి ఏ స్థాయిలో స్పందన వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు