మన శంకరవరప్రసాద్‌ గారి కోసం వెంకీ మామ!

విక్టరీ వెంకటేష్ ఈ మధ్య సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వరుసగా కొత్త ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అదికాక, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రంలో కూడా వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం వెంకీ అక్టోబర్ 20 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు. మొదటి షెడ్యూల్‌లోనే చిరంజీవి – వెంకటేష్ కలసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. వీటిని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక భారీ సెట్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమాలోని హాస్య సన్నివేశాలపై చిరంజీవి బాగా నమ్మకం ఉంచుతున్నారు. ప్రేక్షకులు థియేటర్‌లో కడుపుబ్బా నవ్వుతారని ఆయన చెబుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories