చంద్రబాబు దార్శనికత దేశానికే మోడల్ అవుతున్న వేళ!

చంద్రబాబు నాయుడు వర్తమాన ప్రపంచానికంటే కనీసం 50 ఏళ్లు ముందుండి ఆలోచిస్తూ ఉంటారని.. అందుకే ఆయన అందరి దృష్టిలో దార్శనిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోగలిగారని ఆయనను ఎరిగిన వాళ్ళు అందరూ అంటూఉంటారు. ఇప్పుడు అదే విషయం సాధికారంగా నిరూపణ అవుతోంది. ఏ దార్శనిక దృక్పథంతో అయితే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త పరిపాలన సౌలభ్యాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చారో అదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం కసరత్తు జరుగుతోంది. ఇది కచ్చితంగా చంద్రబాబు నాయుడును యావత్ దేశానికి రోల్ మోడల్ గా నిలబెడుతున్న ఆలోచన అని ప్రత్యర్థులైనా సరే ఒప్పుకు తీరాలి.

వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో చంద్రబాబు నాయుడు కొత్త పరిపాలన విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం వాట్సాప్ ద్వారా వందల రకాలైన ప్రభుత్వ సేవలను ప్రజలు చిటికెలో పొందగలుగుతూ ఉండడం ఒక సరికొత్త విప్లవానికి నాంది అని అనుకోవాలి. ఇప్పుడు ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా పౌర సేవల కోసం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ వెల్లడించారు.

జాతీయ ఈ గవర్నెన్స్ కు సంబంధించిన సదస్సు విశాఖపట్నంలో జరుగుతోంది. స్వయంగా చంద్రబాబునాయుడే ఈ జాతీయస్థాయి సదస్సును ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వంతో సంయుక్తంగా కేంద్రం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రజలకు అందించే ప్రభుత్వ పౌర సేవలలో డిజిటల్ విప్లవాన్ని సాధిస్తే వికసిత్ భారత్ సాకారం అవుతుందనే ఆలోచనతో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా దేశమంతా అమలు చేయాలని సంకల్పిస్తున్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ అనేది.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికీ ఎంతో అందుబాటులో ఉంటూ, ప్రభుత్వయంత్రాగాన్ని మునివేళ్ల వద్దకు తీసుకువచ్చిన సదుపాయం అని చెప్పాలి. బస్సు టికెట్లు బుక్ చేసుకోవడం దగ్గరినుంచి, కులధ్రువీకరణ ఇతరత్రా సర్టిఫికెట్లను పొందడం వరకు ఇది చాలా కీలకంగా ప్రజలకు సేవలందిస్తోంది. ప్రజలకు ప్రభుత్వం తరఫు నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడంలో కూడా విప్లవాత్మకంగా ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు దార్శనికత దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని పలువురు శ్లాఘిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories