ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులను థియేటర్స్ కి ఆకర్షించిన చిత్రాల్లో “మహావతార్ నరసింహ” కూడా ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ యానిమేషన్ మూవీకి ఎలాంటి స్టార్ హీరోలు లేకపోయినా, కథలోని భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్ ప్రెజెంటేషన్ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా కట్టిపడేసింది. విడుదల తర్వాత భారీ స్థాయిలో వసూళ్లు సాధించి 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
తాజాగా ఈ సినిమా థియేటర్స్ రన్ పూర్తి చేసుకొని ఓటిటి లోకి వచ్చింది. నిన్న నెట్‌ఫ్లిక్స్ ఆకస్మికంగా అనౌన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి తెలుగు సహా ఇతర ప్రధాన భారతీయ భాషల్లో కూడా ప్రేక్షకులు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.