పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు హను రాఘవపూడితో ఒక భారీ పీరియాడిక్ ఎపిక్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి “ఫౌజీ” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్.
ఈ కథలో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు, సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు హను రాఘవపూడి బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను సంప్రదించారని తెలుస్తోంది. కానీ అభిషేక్ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై తన సమాధానం ఇవ్వలేదని వినిపిస్తోంది. అయితే, ఇలాంటి రోల్స్‌ను అభిషేక్ చాలా సహజంగా పోషించగలడనే నమ్మకం టీమ్‌లో ఉందట.
ప్రభాస్ గత చిత్రం కల్కి 2898 ఏడిలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో మెరిసి, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ తరువాత ఆయన కొడుకు అభిషేక్ కూడా ప్రభాస్‌తో కలిసి తెరపై కనిపిస్తే, వారి మధ్య వచ్చే సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు.