పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాపై సినీప్రేమికుల్లో ఉన్న ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.
ఇక తాజాగా మూవీ టీమ్ ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 21 ఉదయం 10:08 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టైలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
దర్శకుడు సుజీత్ ఈ సినిమాను పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వింటేజ్ లుక్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్లు చూసి ప్రేక్షకులు సినిమా కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నారు.
సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.