పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా “ఓజి”పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ రూపొందిస్తుండగా, రిలీజ్‌కి ఇక వారం మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్లను బయటకు వదులుతున్నారు.
ఇప్పటికే అర్జున్ దాస్ లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన టీమ్, తాజాగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌ను కూడా రివీల్ చేసింది. ఆయన ఈ సినిమాలో సత్య దాదా పాత్రలో కనిపించబోతున్నారు. ప్రత్యేకమైన లుక్‌తో ఆయనను చూపించిన ఈ పోస్టర్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
ప్రకాశ్ రాజ్ రోల్ సినిమాకి ఎంత ప్రాధాన్యత కల్పిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.