నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ 2 తాండవం”పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలోకి చేరుకున్నట్టు సమాచారం. అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సినిమా యూనిట్ ఒక పార్టీ సాంగ్‌ను తెరకెక్కిస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు పూర్తవుతే షూటింగ్ మొత్తం ముగిసినట్టే అవుతుంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు 14 రీల్స్ సంస్థ తీసుకుంది.