‘మార్కో’ సీక్వెల్ కి టైటిల్‌ ఏంటో తెలుసా!

ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర ఒక క్రేజీ వైలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న చిత్రం మార్కో. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో హనీఫ్ అదేని ఈ సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ అయిన తరువాత తెలుగు, హిందీ మార్కెట్లలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది.

కానీ సినిమా విజువల్స్, అలాగే అధికంగా చూపించిన హింసాత్మక సీన్స్ వల్ల కొన్ని వివాదాలు కూడా రేకెత్తాయి. ఆ కారణంగా దీని సీక్వెల్ నిలిచిపోతుందా అన్న సందేహాలు వచ్చాయి. అయితే తాజాగా మేకర్స్ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం వస్తోంది.

ఈ సారి టైటిల్‌ను లార్డ్ మార్కోగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇందులో ఉన్ని ముకుందన్ కనిపించరనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై పూర్తి స్పష్టత మాత్రం ఇంకా రాలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories