ఆపేది ఎవర్రా..!

బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సినిమాల్లో భారీ విజయం సాధించిన చిత్రంగా “సైయారా” నిలిచింది. థియేటర్లలోనే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా ఇది ఒక కమర్షియల్ హిట్‌గా రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నేటి యువత ఈ సినిమాకి బాగా కనెక్ట్ కావడం వల్లే ఇంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా గ్లోబల్ లెవెల్‌లో భారీ వ్యూయర్‌షిప్ సాధించింది. నాన్-ఇంగ్లీష్ కేటగిరీలో అత్యధికంగా వీక్షించిన సినిమా గా రికార్డు సృష్టించింది.

జర్మన్ థ్రిల్లర్ “ఫాల్ ఫర్ మీ”తో పాటు నెట్‌ఫ్లిక్స్ హిందీ ఒరిజినల్ “ఇన్‌స్పెక్టర్ జెండె” వంటి ప్రాజెక్టులను వెనక్కి నెట్టి టాప్ స్థానంలోకి ఎక్కడం ఈ సినిమాకి పెద్ద సక్సెస్‌గా చెప్పుకోవాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories