వారెవ్వరికీ ఆత్మసాక్షి పనిచేయడం లేదా?

ఇవాళ్టి నుంచి శాసనసభ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. జగన్ వారినందరినీ కట్టడిచేసి.. ఇళ్లలోనే కూర్చోబెడుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం గురించి.. ప్రజల్లోు సర్వత్రా చర్చ నడుస్తోంది. అధికార కూటమి పార్టీలకు చెందిన నాయకులు.. వైసీపీ గైర్హాజరీలపై పదేపదే సవాళ్లు విసురుతున్నారు. స్పీకరు వారు రాకపోవడం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో కూడా వీరి బాధ్యతారాహిత్యం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇన్న జరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో మాత్రం చలనం రావడం లేదు. స్పందన కలగడం లేదు. వారెవ్వరికీ ఆత్మసాక్షి పనిచేయడం లేదా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది.

ఏపీ అసెంబ్లీ స్పీకరు అయ్యన్నపాత్రుడు మళ్లీ ఒకసారి పిలుపు ఇచ్చారు. ‘‘వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలని కోరుతున్నా. తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇదో అవకాశం. అయ్యన్నపాత్రుడుగా నాకు గౌరవం ఇవ్వాలని అడగడం లేదు. సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉంది. ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట తిరగడం మంచిది కాదు’’ అని అయ్యన్నపాత్రుడు అంటున్నారు.
అయ్యన్న పాత్రుడు ఇప్పుడు చెబుతున్న మాటలు మాత్రమే కాదు. తొలినుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు ఇదే చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులకు హాజరు కాకుండా ఉంటే, అతడికి జీతం రాదు అని, కొన్నాళ్లకు ఉద్యోగం కూడా పోతుందని.. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎందుకు జీతం ఇవ్వాలని కూడా ఆయన ప్రశ్నించారు. కేవలం వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న అనుచితమైన తీరును ప్రస్తావిస్తూ.. లోక్ సభ స్పీకరు ఓంబిర్లాను కూడా ఆయన ఇలాంటి పెడపోకడల విషయంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు ఉండాలని కూడా కోరారు. ఇలా పలుమార్లు వీరి గైర్హాజరీపై విమర్శలు వస్తుండడం వల్ల ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇంత అవుతున్నా.. వైసీపీ ఎమ్మెల్యేల్లో మాత్రం ఆత్మసాక్షి పనిచేయడం లేదా అనే చర్చ జరుగుతోంది. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలు తమను గెలిపించినందుకు, అసెంబ్లీకి హాజరు కావడమూ.. వారి సమస్యల గురించి మాట్లాడడమూ తమ ప్రాథమిక విధి అనే సంగతిని కూడా వారు గుర్రతించకపోతే ఎలాగ? అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు జగన్ మినహా పది మంది ఆ పార్టీ తరఫున గెలిచారు. వాళ్లెవ్వరూ మరోసారి గెలవకుండా ఇలాంటి వ్యవహారాల వల్ల అపకీర్తి తప్పదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories