తెలుగు సినిమాల్లో కొత్త టాలెంట్ తో ఆకట్టుకుంటున్న దర్శకుల్లో ఆదిత్య హాసన్ పేరు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన 90స్ బయోపిక్ సిరీస్ తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు దర్శకత్వంతో పాటు నిర్మాణంలో కూడా అడుగుపెట్టారు. ఇటీవలే మౌళి తనూజ్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్ గా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఆయన నిర్మాణంలో విడుదలై మంచి లాభాలు సాధించింది.
ఈ విజయం తర్వాత ఆ సినిమా టీం సంతోషంగా జరుపుకుంటున్న పరిస్థితి. ఇక ఆదిత్య హాసన్ నుంచి వచ్చే ప్రాజెక్ట్ పై కూడా ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది. ఇప్పటికే ఆయన ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమా కోసం ఓటిటి రైట్స్ విషయమై పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది.
టాక్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ 11 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు తెలుస్తోంది.