టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ అందుకున్న చిత్రం ఓజి అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా పట్ల అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు, థమన్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇటీవలి వరకు ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ఉంటాయని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం వేరేలా ఉందని తెలుస్తోంది. అసలు సెప్టెంబర్ 24న ప్రత్యేక ప్రదర్శనలు ఉండవని, కానీ 25 అర్ధరాత్రి దాటిన వెంటనే అంటే రాత్రి 1 గంటకు, ఆ తరువాత ఉదయం 4 గంటలకు ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ షెడ్యూల్ పై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది.