లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీస్ లో ఒకదిగా నిలిచింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన “కిష్కింధపురి”. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతూ మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.
ఈ సినిమాపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేయడం ఫిల్మ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన చెప్పినదాని ప్రకారం, కిష్కింధపురి ఒక సాధారణ హారర్ కథలా కాకుండా, సైకలాజికల్ యాంగిల్ తో చెప్పిన విధానం బాగా నచ్చిందని చెప్పారు. అలాగే సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బాణీలు కథకు చక్కగా సరిపోయాయని ప్రత్యేకంగా ప్రశంసించారు.
హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ ఇద్దరూ తమ పాత్రల్లో బలమైన నటన కనబరిచారని మెగాస్టార్ అభినందించారు. అలాగే తన తదుపరి సినిమా “శివ శంకర వరప్రసాద్ గారు”కి నిర్మాతగా ఉన్న సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్ లో మంచి ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.