మిరాయ్‌ కలెక్షన్ల జోరు!

తేజ సజ్జా హీరోగా నటించిన తాజా సినిమా మిరాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, రిలీజ్ రోజునుంచే మంచి టాక్ సంపాదించుకుంది. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. మూడురోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 81 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని చిత్రబృందం వెల్లడించింది.

ఈ సినిమాలో తేజ సజ్జా చేసిన సూపర్ హీరో పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అతని యాక్షన్, ప్రెజెన్స్‌తో పాటు గ్రాఫిక్స్, విజువల్స్ కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో షోలు పెంచేంతగా ఆడియెన్స్ రెస్పాన్స్ కనిపిస్తోంది.

మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. ఆయన గెటప్, యాక్టింగ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హీరోయిన్‌గా రితికా నాయక్ నటించగా, గౌర హరి సంగీతం అందించాడు. మొదటి రోజు 27 కోట్లకు పైగా, రెండో రోజు 28 కోట్లకు దగ్గరగా, మూడో రోజు 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా దూకుడు తగ్గకపోవడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories