న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమా భారీ విజయాన్ని సాధించి ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక్కసారిగా టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు ఆయన మళ్లీ నానితో కలసి ‘ది ప్యారడైజ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవల ఈ సినిమాలో మోహన్ బాబు విలన్‌గా కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ విషయం మంచు లక్ష్మీ చెప్పడంతో ఆ వార్త మరింత హాట్ టాపిక్‌గా మారింది. కానీ నిజానికి మోహన్ బాబు నెగటివ్ రోల్ చేయడం లేదు. ఆయన గురువు పాత్రలో కనిపించబోతున్నారని, నాని పోషిస్తున్న హీరో పాత్రకు ఆయన పాత్రే ప్రేరణగా నిలుస్తుందని సమాచారం.
ఈ సినిమాలో నాని జడల్ అనే ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో ఆయన పూర్తిగా కొత్తగా మారిపోయి కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.