ఇలా చెప్పే మరొక నాయకుడిని చూడగలమా?

అధికారంలో ఉన్న నాయకులు ప్రభుత్వ యంత్రాంగం మీద, వ్యవస్థల మీద పెత్తనం చేస్తూ ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. అధికార పార్టీకి చెందిన వారి మాట వినకపోతే ప్రభుత్వ సిబ్బంది మీద పై స్థాయి వారి నుంచి రాజకీయ ఒత్తిడులు వస్తాయని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలనలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ‘‘మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పే మాటల్లో అయినా సరే మంచి ఉంటే మాత్రమే స్వీకరించండి’’ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల ఎస్పీలతో అంటున్నారు. ఈ మాటల ద్వారా అనుచితమైన అంశాలలో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగవలసిన అవసరం లేదని ఆయన పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న వైనం మనం గమనించవచ్చు.
గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో పోలీసు యంత్రాంగాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఎలా నడిపించారో రాష్ట్రమంతా గమనించారు. ప్రభుత్వ శాఖలకు మంత్రులుగా ఎవరు ఉన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అనే పార్టీ వ్యక్తి.. సకల శాఖల మంత్రిగా చెలరేగిన తీరును కూడా ప్రజలు చూశారు. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సజ్జల మాటలను శిరసావహిస్తూ పనిచేసిందనే సంగతి కూడా అప్పటి పాలనను గమనించిన వారికి తెలుసు.  అలాంటి దుర్మార్గాలను ప్రజలు అసహ్యించుకున్నారు గనుకనే, జగన్ ఇవాళ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుని ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఇలాంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం వ్యవస్థ సగౌరవంగా, స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది. సమావేశంలో అనుచితమైన ఆబ్లిగేషన్ అధికార పార్టీ నాయకులు నుంచి వచ్చినా కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి చెప్పడం చాలా కీలకంగా ప్రజల భావిస్తున్నారు.

జిల్లాల ఎస్పీలతో అమరావతిలో జరిగిన సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులతో, నాయకులతో సామరస్యంగా సమన్వయంతో పనిచేయండి.. అలాగని తప్పు జరిగితే.. ఏ పార్టీ వారైనా సరే శిక్షించండి.. అని ఫ్రీహ్యాండ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ముసుగులో సైకోలు రెచ్చిపోకుడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హితబోధ చేశారు.

ముఖ్యమంత్రి మనోగతాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు కూడా మనసుకు ఎక్కించుకోవాలని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఎలాంటి అనుచితమైన ఒత్తిడితో పోలీసుల వద్దకు వెళ్లకూడదని, అలాంటి వాటి వలన తాత్కాలిక ప్రయోజనాలు కొన్ని నెరవేరవచ్చునేమో గాని అంతిమంగా పార్టీకి చెప్పలేనంత నష్టం జరుగుతుందని వారు గుర్తించాలి. మొత్తానికి చంద్రబాబు నాయుడు పారదర్శక, నిష్పాక్షిక పరిపాలన అందించడంలో తన ముద్రను చూపిస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories