పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి”పై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను పూర్తిగా గ్యాంగ్‌స్టర్ స్టైల్‌లో తెరకెక్కించడంతో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా విడుదలకు ముందు రోజు ప్రత్యేక ప్రీమియర్ షోలు ఉండొచ్చనే వార్తలు ఫిలింనగర్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల తరువాతే షోలు ప్రారంభం కావచ్చని చర్చ నడుస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితులు కాస్త వేరుగా ఉన్నాయన్న టాక్ ఉంది. నిజమైన షెడ్యూల్‌పై అధికారిక క్లారిటీ మాత్రం త్వరలో రానుంది.