పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “ఓజి”పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు దర్శకుడు సుజీత్ మెగాఫోన్ పట్టారు. మొదటి నుంచే ఈ సినిమాపై క్రేజ్ పెరుగుతూనే ఉంది. మేకర్స్ కూడా షెడ్యూల్స్ పూర్తయ్యాయని, షూటింగ్ మొత్తం ముగిసిందని ప్రకటించారు.
అయితే తాజాగా వచ్చిన ఒక అప్డేట్ మాత్రం అభిమానుల్లో సందేహాలు రేకెత్తించింది. ఈ సినిమాకి కెమెరా మన్‌గా పనిచేస్తున్న రవి కె చంద్రన్, షూటింగ్ సెట్స్‌లో సుజీత్‌తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “ఇదే మా చివరి రోజు షూట్” అని రాసుకున్నారు. దీంతో ఇంకా షూటింగ్ జరుగుతోందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక రిలీజ్ సమయం దగ్గర్లోనే ఉండటంతో ఇలాంటి పోస్టు బయటకు రావడం మరింత చర్చకు దారి తీసింది. కొందరు ఇది అసలు సినిమా షూట్ కాకుండా ప్రమోషనల్ కంటెంట్ కోసం చేసిన పని కావచ్చని అంటున్నారు. కానీ నిజంగా ఏమిటి అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.