టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కొత్త హారర్ థ్రిల్లర్ సినిమా “కిష్కింధపురి” త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ కథను రహస్యమైన టచ్‌తో తెరకెక్కించగా, మొదటి నుంచీ చివరి వరకు థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఇస్తుందనే నమ్మకం టీమ్‌లో ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకు ప్రత్యేక ప్రీమియర్ షోలు జరగగా, చూసిన వారు మంచి స్పందన ఇస్తున్నారని సమాచారం. రిలీజ్‌కు ముందు నుంచే సినిమా మీద బజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా మొదటి 10 గంటల్లోనే దాదాపు పది వేలకుపైగా టికెట్లు అమ్ముడవ్వడం దీనికి వచ్చిన క్రేజ్‌ని స్పష్టంగా చూపిస్తోంది.