మా వాళ్ళు ఇంకా గేర్ లోకి రాలేదంటున్న జగన్!

ఒకవైపు చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు సాగిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారాలను గురించి పదే పదే ప్రస్తావిస్తూ.. వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడం గురించి కూటమి పార్టీల నాయకులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ పెట్టాలని అంటుంటారు. విమర్శలను తిప్పికొట్టడంలో నాయకుల సమర్థంగా వ్యవహరించడం లేదని చెబుతుంటారు. అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మేం చేసిన పనుల మేం చెప్పుకోవడం కూడా మా వాళ్లకు చేత కావడం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఇటీవల జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు.. ‘మా వాళ్లు ఇంకా గేర్ లోకి రాలేదు’ అని అనడం నవ్వులపాలు అవుతోంది. వాళ్లు చేసిన పనుల్ని వాళ్లు సరిగా చెప్పుకోలేకపోతున్నారట పాపం. చేసిన దాని కంటె చెప్పుకోవడం ఎక్కువ అయిపోవడం వల్లనే కదా.. జగన్మోహన్ఱ రెడ్డి ప్రభుత్వం పతనం అయిపోయింది.. అనే సంగతి ఆ పార్టీ నాయకులే గుర్తు చేసుకుంటున్నారు. జగన్ తాను అధికారంలో ఉన్న రోజుల్లో గడపగడపకు వైసీపీ పేరుతో ఎమ్మెల్యేలను ఇంటింటికీ తప్పి.. మీ ఇంటికి మేం ఇంత సొమ్ములిచ్చాం.. ఇంత దానం చేసాం అంటూ పదేపదే ఊదరగొట్టించారు. ఎమ్మెల్యేలు చెప్పడం చాలదన్నట్టుగా.. వాలంటీర్లను మరీ విచ్చలవిడిగా వాడుకుంటూ.. ఇంటింటికీ తిప్పి.. మీకు డబ్బులు జగనన్నే ఇస్తున్నాడు.. జగనన్నను మళ్లీ గెలిపించకుంటే మీకు ఈ డబ్బులు రావు.. అంటూ ముసలాళ్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. చేసినదానికంటె ఈ అతి ఎక్కువ కావడం వల్ల మాత్రమే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం చెందిపోయింది.

ఓడిపోయిన ఏడాది తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో క్లారిటీ వచ్చినట్టు లేదు. అందుకే .. ఇప్పటికీ మా వాళ్లకు చేసింది కూడా చెప్పుకోవడం తెలియడం లేదు అని డైలాగులు వల్లిస్తున్నారు.
వైసీపీ వాళ్లకు చేతకావడం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిజమే అని జనం జోకులేసుకుంటున్నారు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను మాత్రమే మేధావిగా చలామణి కావడం కోసం నిజంగానే చేతగాని వాళ్ళను మాత్రమే చుట్టూ పెట్టుకుని పార్టీని నడుపుతున్నాడని ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకే శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఏ మాట మాట్లాడాలన్నా సరే స్క్రిప్టులు మాత్రం తాడేపల్లిలో వండబడి అందరికీ అందజేస్తుంటారని ఎద్దేవా చేస్తున్నారు.

అదే సమయంలో చేసింది చెప్పుకోవడం లేదు.. అనడంపై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. మీరు చేసిన మంచి పనులన్నీ అతిగా చెప్పేసుకోవడం ఆల్రెడీ అయింది. ఇక చెప్పుకోకుండా మిగిలిపోయినదెల్లా.. మీరు చేసిన విధ్వంసం మాత్రమే. అవన్నీ ఘనంగా చెప్పుకోండి.. ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories