తెలుసుకదా..ముగింపు ఎలా ఉంటుందో తెలుసా!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త సినిమా తెలుసు కదా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి హీరోయిన్‌లుగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా నటిస్తుండగా, నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

టీజర్ మొదటినుంచే ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. ఇందులో రొమాంటిక్ వైబ్ ఎక్కువగా కనిపిస్తోంది. హీరో ఇద్దరు హీరోయిన్‌లతో చేసే లవ్ జర్నీని చూపిస్తూ, చివరికి ఆయన ఎవరి జీవిత భాగస్వామి అవుతాడో అన్న సస్పెన్స్‌ని బాగా హైలైట్ చేశారు. ఈ మిస్టరీని మొత్తం టీజర్ లో మేకర్స్ స్మార్ట్‌గా మైంటైన్ చేశారు.

విజువల్స్, కెమెరా వర్క్, మ్యూజిక్ ఇలా అన్ని కలిసి సినిమాకి కావాల్సిన రొమాంటిక్ ఫీల్‌ని అందించాయి. ముఖ్యంగా ప్రధాన పాత్రధారులు తమ ఎమోషన్స్, కెమిస్ట్రీతో టీజర్‌లోనే ఆకట్టుకున్నారు. ముగ్గురి మధ్య లవ్ ట్రయాంగిల్ ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories