పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ ప్రాజెక్ట్ “ఓజి”పై సినీ ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గత సంవత్సరం రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ అనుకోని కారణాల వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైంది. అయితే ఆ గ్యాప్‌లోనూ సినిమాపై ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ లేకుండానే ప్రేక్షకులను ఆకర్షించగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
కానీ మరోవైపు, ఈ స్థాయి సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే పెద్దగా ఆకర్షణీయంగా లేవని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో రావాల్సిన “హరిహర వీరమల్లు” బజ్ తగ్గిన తర్వాత ఆ స్థానం “ఓజి” దక్కించుకున్నా, తమిళ్, హిందీ భాషల్లో మాత్రం ఇంకా సరైన ప్రమోషనల్ ప్లాన్‌లు కనిపించడం లేదని అంటున్నారు.