ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహిస్తున్న “కాంతార 1” ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సినిమా డివోషనల్ టచ్ తో కూడిన పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో ప్రారంభం నుంచే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మేకర్స్ ఈ సినిమాను దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
ఇక డిజిటల్ హక్కుల విషయానికొస్తే, ఈ చిత్రంపై ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టినట్టు సమాచారం. ప్రైమ్ వీడియో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నట్టు ముందే ప్రకటించినా, ఇప్పుడు వినిపిస్తున్న సంఖ్య అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం, ప్రైమ్ వీడియో “కాంతార 1” కోసం దాదాపు 125 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిందట. అయితే ఈ డీల్ కేవలం సౌత్ భాషలకేనా లేక హిందీ వెర్షన్ కూడా ఇందులో భాగమైందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.