డ్రాగన్ లో మరో కన్నడ నటుడు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద క్రేజ్‌ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా. ఈ ప్రాజెక్ట్‌ గురించి కొత్త అప్‌డేట్‌ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపింది. అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందని, ఆ రోల్‌లో కన్నడ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నాడని వినిపిస్తోంది. ఆయన ఫ్లాష్‌బ్యాక్‌ భాగంలో కీలకంగా ఉంటారని టాక్‌.

ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ రాసిన కథలతో పోలిస్తే ఈసారి స్క్రిప్ట్ చాలా బలంగా, ఆసక్తికరంగా రూపుదిద్దుకున్నదని తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక టైటిల్ విషయంలో “డ్రాగన్” అనే పేరు చర్చల్లో ఉంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే హైలైట్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ బాగా కృషి చేస్తున్నాడని సమాచారం. అందుకే స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి కూడా ఆయన చాలా సమయం కేటాయించారట.

Related Posts

Comments

spot_img

Recent Stories