ఇప్పుడు వాయుపుత్ర..!

ఇటీవల థియేటర్లలో వచ్చిన 3డి యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. యానిమేషన్ సినిమాలు ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్లు సాధించడం చాలా అరుదు. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియన్ సినిమా మార్కెట్‌లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ విజయం తర్వాత యానిమేషన్ సినిమాలపై ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.

ఇదే సమయంలో నిర్మాత నాగవంశీ కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాను కూడా భారీ స్థాయిలో 3డి యానిమేషన్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. “వాయుపుత్ర” అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కార్తికేయ, తండేల్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా రావడం మరో పెద్ద ప్లస్‌గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories